Na Autograph Movie Songs | Mounamgane Yedagamani Video Song | Bhumika

Mounamgane Yedagamani Video Song | Bhumika



మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

చరణం 1:

దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా
భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వులపంట ఉంటుంది గా
సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ
కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ
తెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీ

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది

చరణం 2:

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ
నచ్చినట్టు గా నీతలరాతని నువ్వే రాయాలీ

నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ

అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.

Movie : Na Autograph
Starring         : Bhumika, Raviteja
Directed by : S. Gopal Reddy
Produced by : B. Suresh
Music by : M. M. Keeravaani


Share this

Related Posts

Previous
Next Post »

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng